NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
1947-1948 భారత్-పాకిస్థాన్ మొదటి యుద్ధం
కాశ్మీర్ ని కాపాడడానికి భారత్ పాకిస్థాన్ తో చేసిన మొదటి యుద్ధాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం.
స్వాతంత్ర్యం తర్వాత భారత సైన్యం చేసిన మొట్టమొదటి యుద్ధం గురించి మీకు తెలుసా?
స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్ ని ఏ దేశం లోనూ కలపము,స్వతంత్రంగానే ఉంచుతామన్న కాశ్మీర్ చివరి రాజు మహారాజ హరి సింగ్ అక్టోబర్ 27,1947లో భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది?
1815 ముందు జమ్మూ కాశ్మీర్ 22 చిన్న స్వతంత్ర్య రాజ్యాలుగా ఉండేవి.16 హిందూ రాజ్యాలు మరియు 6 ముస్లిం రాజ్యాలు ఉండేవి.వీటన్నింటినీ కలిపి పంజాబ్ లోని కొండ రాజ్యాలుగా పిలిచేవారు.1757 నుండి 1857 వరకూ రాజ్ పుత్రులు మొఘల్ సామ్రాజ్యం లో భాగంగా వారి రాజ్యాలను పాలించారు.తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చింది.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భావం మరియు మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత కొండ రాజ్యాల అధికారం క్షీణించింది.తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం జమ్మూని సిక్కు నాయకుడు రంజింత్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు.1845-46 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం లో ఈస్ట్ ఇండియా కంపెనీ కాశ్మీర్ పైన సార్వభౌమాధికారం సాధించింది.1846 లో లాహోర్ లో జరిగిన ఒప్పందం ప్రకారం సిక్కులు బ్యూస్ మరియు సట్లెజ్ నదుల మధ్య విలువైన భూమితో పాటు 12 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.కానీ అంత డబ్బు లేనందున సిక్కు రాజ్యం లోని కాశ్మీర్ ప్రాంతాన్ని డోగ్రా నాయకుడు గులాబ్ సింగ్ కి 7,50,000 రూపాయలకు అప్పగించింది. డోగ్రా రాజు స్వయం ప్రతిపత్తి కలిగిన కాశ్మీర్ రాజ్యానికి మొదటి రాజయ్యాడు.ఒక కొత్త రాజ వంశాన్ని స్థాపించాడు.
భారత్ కి స్వాతంత్ర్యం వచ్చి పాకిస్థాన్ భారత్ విభజన తర్వాత రెండు దేశాలూ జమ్మూ కాశ్మీర్ తమతో కలుస్తుందని కోరుకున్నాయి.భారత్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.కానీ కాశ్మీర్ మహారాజ హరిసింగ్ గారు మాత్రం ఏ వైపుకి వెళ్ళకుండా స్వతంత్రం గా ఉండాలని కోరుకున్నారు.దాని కోసం రెండు దేశాల నుండి నిలుపుదల ఒప్పందం కావాలని కోరాడు.పాకిస్థాన్ ఆ నిలుపుదల ఒప్పందం పై సంతకం చేసింది.
కానీ భారత్ మాత్రం దానికి ఒప్పుకోలేదు.తదుపరి చర్చల కోసం తమ ప్రతినిధిని ఢిల్లీ పంపాలని కోరారు.కానీ కాశ్మీర్ నుండి ఎవ్వరూ రాలేదు.మరొక వైపు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాశ్మీర్ పేరుతో ముస్లిం గిరిజనులు కాశ్మీర్ కి స్వతంత్రం కావాలని నిరసనలు మొదలుపెట్టారు.ఈ గొడవల వల్ల మహారాజ షేక్ అబ్దుల్లా ని అరెస్టు చేశారు.నెహ్రూ కూడా ఇది ముస్లిం ల పైన జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.ఈ దాడిని ఆపాలంటూ కాశ్మీర్ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడారు.నెహ్రూ తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా ని విడుదల చేయాలని కోరారు.మౌంట్ బాటన్ మరియు పటేల్ కూడా కోరారు.కానీ మహారాజ దానికి ఒప్పుకోలేదు.దాంతో గిరిజనులలో తిరుగుబాటు మరింత ఆగ్రహం మొదలయ్యింది.
అలాగే పాకిస్థాన్ శాసనసభ ఏర్పడేంత వరకూ ఏ దేశంలో కలవాలి?లేదా నిశ్చలంగా ఉండాలని నిర్ణయం తీసుకోవద్దని మౌంట్ బాటన్ కోరారు.ముఖ్యంగా నెహ్రూ తన కాశ్మీర్ మూలాలు అలాగే తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా కోసం కాశ్మీర్ భారత్ లో కలవాలి అని కోరుకున్నాడు.
అదే సమయంలో భారత్ జమ్మూ కాశ్మీర్ యొక్క నిలుపుదల ఒప్పందం ఇంకా ఎటూ తేలలేదని తెలిసి జిన్నా తన ప్రైవేటు సెక్యూరిటీ ఖుర్షీద్ హసన్ ని శ్రీనగర్ పంపి పాకిస్థాన్ తో విలీన ఒప్పందం గురించి మాట్లాడించారు."మీరు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నారనీ,ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదనీ, షేక్ అబ్దుల్లా లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కి సమాధానం చెప్పనక్కర్లేదు అని రాసిన లేఖను ఖుర్షీద్ మహారాజ కి ఇచ్చాడు.నిలుపుదల ఒప్పందం పై పాకిస్థాన్ సంతకం చేసిన 12 రోజుల లోపునే హెచ్చరికను పంపించారు.మీరు పాకిస్థాన్ ని ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్ తో కలవాడానికి మీరు ఒప్పుకోకపోతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు అని హెచ్చరిస్తూ లేఖ రాసారు.మరోవైపు జవహార్ లాల్ నెహ్రూ మరియు గాంధీ కూడా కాశ్మీర్ భారత్ తో కలవాలని కోరుకున్నారు.నెహ్రూ మూలాలు కాశ్మీర్ లో ఉండడం, షేక్ అబ్దుల్లా తన మిత్రుడు కావడం కూడా కారణాలే.కానీ పాకిస్థాన్ లో కలవాలి అనుకున్న హైదరాబాద్ సంస్థానం నిజాం గురించి ఆలోచిస్తున్నారు ఆ సమయంలో.
జిన్నా షేక్ అబ్దుల్లా ని కూడా కాశ్మీర్ ని పాకిస్థాన్ తో కలపడానికి సహకరించాలని కోరారు.మత ప్రాతిపదికన,వస్తు సరఫరా మరియు భౌగోళికంగా కూడా కాశ్మీర్ పాకిస్థాన్ తోనే కలుస్తుందని జిన్నా ఆశపడ్డాడు.కానీ అబ్దుల్లా కూడా దానికి ఒప్పుకోలేదు.జిన్నా ఇస్లాం కి ఏకైక ప్రతినిధిగా మరియు ఇస్లాం రాజ్యం మొత్తానికి తనే అధికారంలో ఉండాలని కోరుకోవడం దానికి కారణం.జిన్నా ఇవన్నీ ఆలోచించి ఇక కాశ్మీర్ భారత్ తో కలిసిపోతుందని భయపడి చివరిగా బల ప్రయోగం చేసి కాశ్మీర్ ని లాక్కోవాలని అనుకున్నాడు.పైగా షేక్ అబ్దుల్లా కి కూడా తన స్నేహితుడు ప్రధాన మంత్రి గా ఉన్న భారత్లో కలిస్తేనే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది అని అనుకున్నాడు.
1947 జూన్ లో 60,000 మంది మాజీ సైనికులు (ఎక్కువగా పూంఛ్ కి చెందిన వారు) మహారాజ కు వ్యతిరేకంగా పన్ను వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ ప్రచారం ఆగస్టు 14 మరియు 15 న పూంచ్ ముస్లిం లు పాకిస్థాన్ జెండా ఎగురవేయడంతో ఇది వేర్పాటు వాద ఉద్యమం గా మారింది.దాంతో మహారాజ అక్కడ మార్షల్ లా విధించారు.దాంతో మరింత కోపం తెచ్చుకున్న ముస్లిం లు NWFP యొక్క గిరిజనులు కూడా కలిసి వీరు తెచ్చిన మందు గుండు సామగ్రి తో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
సెప్టెంబర్ 4 1947న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దళాల కమాండర్ జనరల్ హెన్రీ స్కాట్ అనేక చోట్ల పాకిస్థానీలు చొరబడి ఆ ఉద్యమం లో కలుస్తున్నారనీ, వారి గురించి పాకిస్థాన్ తో చర్చించాలని చెప్పారు.అదే రోజున జమ్మూ కాశ్మీర్ ప్రధాని జనక్ సింగ్ ఈ విషయం అధికారికంగా పాకిస్థాన్ కి తెలియజేసి సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.అయితే జమ్మూ నుండి కూడా చాలా మంది హిందువులు సియాల్ కోట్ లో చొరబడుతున్నారంటూ ఆరోపణ చేసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.కానీ పాకిస్థాన్ ప్రోత్సాహం తో రెచ్చిపోయిన తిరుగుబాటు దారులు అనేక దాడులకు పాల్పడుతున్నారు. పైగా అందులో చాలా మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నవారే కావడంతో,వాళ్ళకి యుద్ధ విద్యలు, ఆయుధాలను ఉపయోగించడం తెలియడం వల్ల ఆ దాడులు మరింత దారుణంగా తయారయ్యాయి.
భారత విభజన సమయంలో మారణహోమం
ఇక ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన మహారాజ చివరికి కాశ్మీర్ చేజారిపోతుంది, పాకిస్థాన్ చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని భయపడి షేక్ అబ్దుల్లా ని విడుదల చేసారు.అతను విడుదలైన వెంటనే మహారాజ కు వ్యతిరేకంగా కాశ్మీర్ స్వేచ్ఛ ని కోరుకుంటుందని బహిరంగ సభలో పునరుద్ఘాటించారు.
22 అక్టోబర్ 1947న పాకిస్థాన్ NWFP నుండి గిరిజనులను కలుసుకుని ఆపరేషన్ గుల్మార్గ్ ప్రారంభించారు.పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ప్రత్యక్ష నియంత్రణలో ఆధునిక ఆయుధాలను అందించి సుమారు 2000 మంది గిరిజనులు బస్సుల్లోనూ నడక మార్గం లోనూ ముజఫరాద్ కి పంపారు.ఈ ఆక్రమణదారులు అక్కడ నుండి ఉరి మరియు బారాముల్లా చేరుకుని అక్కడ మహారాజ సైన్యం పైన దాడులు చేసి తమ స్వాధీనం చేసుకున్నారు.దాంతో శ్రీనగర్ ని కూడా స్వాధీనం చేసుకోవడానికి పెద్ద గా సమయం పట్టదని మహారాజ సైనిక సహాయం కోసం భారత్ కి విజ్ఞప్తి చేశారు.
ఈ అభ్యర్ధన అక్టోబర్ 25న మౌంట్ బాటన్ నేతృత్వంలో నెహ్రూ,పటేల్,బల్దేవ్ సింగ్ ,పోర్ట్ ఫోలియో లేని మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ మరియు సైన్యం, వైమానిక దళం, నావికా దళాల బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ తో సహా జరిగిన భారత రక్షణ కమిటీ సమావేశంలో పరిగణించబడింది.
లెఫ్టినెంట్ జనరల్ కె.కె. ప్రకారం కాశ్మీర్ ప్రభుత్వం అప్పటికే అభ్యర్ధించిన ఆయుధాలు మరియు మందు గుండు సామగ్రి పంపడం తక్షణ అవసరమని ఇవి శ్రీనగర్ ప్రజలని రైడర్ ల నుండి కొంత వరకూ కాపాడుతుందని నిర్ణయించారు.కానీ మౌంట్ బాటన్ మాత్రం కాశ్మీర్ ని భారత్ లో కలిపేంత వరకు సైన్యాన్ని పంపడం సరైన నిర్ణయం కాదని చెప్పారు.అలా చేస్తే భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.అలాగే ఆ చేరికని తాత్కాలికంగా భావించాలనీ, కాశ్మీర్ లో శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దాని భవిష్యత్తు నిర్ణయించవచ్చని చెప్పారు.అదేరోజు స్పాట్ అధ్యయనం కోసం రాష్ట్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.పి.మీనన్ గారిని శ్రీనగర్ కి పంపారు.మరుసటి రోజు తిరిగి వచ్చిన ఆయన అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ వెంటనే దళాలను పంపి రైడర్ల నుండి కాశ్మీర్ ని కాపాడడం చాలా అత్యంత అవసరమనీ తెలియజేశాడు.
ఈలోగా కాశ్మీర్ కొత్త ప్రధాని మెహర్చంద్ మహజన్ గారు మేము 25 సాయంత్రం లోపు విమానం వస్తే భారత్ కి వస్తామనీ, లేకపోతే పాకిస్థాన్ తో కలిసిపోతామనీ హెచ్చరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో భారత సాయుధ దళాలు
మహారాజ కు ప్రభుత్వ అభిప్రాయాలు తెలియజేసేందుకు మీనన్ ని జమ్మూ కి పంపారు. చివరికి అక్టోబర్ 26న మహారాజ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పైన సంతకం చేసి,మహజన్ తో కలిసి మీనన్ తిరిగి ఢిల్లీ వచ్చారు.ఈ విలీన సాధనం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రక్షణ, కమ్యూనికేషన్ మరియు విదేశీ వ్యవహారాల విషయాలలో భారత్ కి పరిమిత ప్రవేశం ఉంటుంది.ఈ పరికరంలో ఉన్నవి
నిబంధన 4: మహారాజ భారతదేశం లో తన రాజ్య విలీనాన్ని ప్రకటించారు.
నిబంధన 5: వాయిద్యం యొక్క నిబంధనలు మారవు మరియు ఏదైనా చట్టం చేయాలంటే/ మార్చాలంటే దానికి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదించాలి.
నిబంధన 6: భూసేకరణ కి సంబంధించి రాష్ట్రంలో చట్టాలు చేసే అధికారం భారత యూనియన్ కి లేదు.మరియు చట్టాలు అనుమతిస్తే తప్ప జమ్మూ కాశ్మీర్ లో భూమిని కొనడం అసాధ్యం.
నిబంధన 7: మహారాజ భవిష్యత్తు భారత రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన అవసరం లేదు మరియు మహారాజ ని ఈ విషయంలో బలవంతం చేయడానికి భారత్ కి హక్కు లేదు.
నిబంధన 8: ఈ నిబంధన లో ఏ విషయం కూడా మహారాజ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేదు.
నిబంధన 9: రాష్ట్రం తరపున సంతకం చేశారు కాబట్టి మహారాజ ని జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రతినిధి గా గుర్తించడం జరుగుతుంది.
నవంబర్ 1,1947లో మొదటి సారిగా లాహోర్ లో భారత దేశ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ మరియు పాకిస్థాన్ గవర్నర్ మహమ్మద్ అలీ జిన్నా తో సమావేశం జరిగింది.దానిలో ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామన్నారు.షేక్ అబ్దుల్లా అధికారిగా ఉండడం వల్ల కాశ్మీర్ భారత్లో కలుస్తుందని నమ్మకం తో ఉన్నారు నెహ్రూ.కానీ అదే కారణంతో జిన్నా దీనికి ఒప్పుకోలేదు.
ఎట్టకేలకు గిరిజనుల దండయాత్ర తిప్పికొట్టేందుకు భారత సైన్యాన్ని విమానంలో శ్రీనగర్ కి పంపారు.షేక్ అబ్దుల్లా చే నియమించిన మిలీషియా సైన్యం ద్వారా శిక్షణ పొందారు.
జనవరి 1 1948న నెహ్రూ అధికారికంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కి తీసుకెళ్ళారు.1948 లో జమ్మూ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ సైన్యం మరియు భారత సైన్యం మధ్య యుద్ధం జరిగింది అని పేర్కొన్నారు.
భారత సైన్యం లోని వీర జాగిలాలు (కుక్కలు)
మే 1948 నాటికి పూంచ్-పశ్చిమ పంజాబ్ సరిహద్దు లో భారత సైన్యం విజయం సాధించింది.ఆజాద్ కాశ్మీర్ సైన్యానికి అండగా పంపడానికి పాకిస్థాన్ తన సైన్యాన్ని బహిరంగంగా సిద్ధం చేసింది.
కానీ 1948 ఆగస్టు 13న పాకిస్థాన్, భారత్ తమ సైన్యాలను వెనక్కి తీసుకోవాలని, ఆజాద్ కాశ్మీర్ సైన్యం ఉపసంహరించుకోవాలని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసింది.అలాగే కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అందులో ఉంది.
భారతీయ సైనిక వర్గాల ప్రకారం పాక్ ఆర్మీ ఆపరేషన్ గుల్మార్గ్ అనే ప్రణాళికను సిద్ధం చేసింది.1947 ఆగస్టు 27 నాటికి దీన్ని అమలులోకి తీసుకొని వచ్చింది.
బన్నూ బ్రిగేడ్ లో పని చేస్తున్న OS.కల్కట్ అధికారికి అనుకోకుండా తెలిసింది.పథకం ప్రకారం పష్తూన్ గిరిజనులతో కూడిన 20 గిరిజన మిలీషియా లష్కర్లు ఒక్కొక్క దానిలో 1000 మందితో బయలుదేరారు.వీరందరూ ఆయుధాలను కలిగి ఉన్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో పెషావర్, కోహట్,థాల్ మరియు నౌషేరా, అక్టోబర్ 18 న అబోటాబాద్ లాంచింగ్ పాయింట్ కి, జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాలని అనుకున్నారు.అక్టోబర్ 22కి 10 లష్కర్లు ముజఫరాబాద్ మీదగా కాశ్మీర్ లోయ పై దాడి చేయాలని ఊహించారు. మరో పది లష్కర్లు పూంఛ్,భీంబర్ మరియు తిరుగుబాటు దారులతో చేరాలని ఆలోచన. జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళడానికి ఆయుధాలతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు కదిలారు.
కాశ్మీర్ లో ఈ అలజడుల వల్ల మహారాజ హరిసింగ్ భయపడ్డారు.అక్టోబర్ 24,1947న భారతదేశానికి ఈ దండయాత్ర గురించి మొదటి సమాచారం అందింది.ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది భారత్.వెంటనే అదే రోజు రాత్రి 11.00 గంటలకు భారత్ ని అత్యవసరంగా సహాయం కోసం అడిగారు.షేక్ అబ్దుల్లా కూడా ఎక్కడ పాకిస్థాన్ కాశ్మీర్ ని చేజిక్కించుకుంటుందోనని భయపడి సైనిక సహాయం అడిగారు.కానీ భారత్ మాత్రం కాశ్మీర్ ని విలీనం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.తర్వాత రోజు మధ్యాహ్నం వి.పి.మీనన్ గారు జమ్మూ కి చేరుకుంటారు మరియు మహారాజ సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ తో ఢిల్లీ కి తిరిగి వస్తారు.
భారత గవర్నర్ ఈ పత్రాన్ని ఆమోదించడంతో అక్టోబర్ 26న కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమైంది.దీంతో మరింత కోపానికి గురైన జిన్నా ఇంకా ఆక్రమణదారులను పంపించింది.
భారత రక్షణ(భారత్-పాక్ యుద్ధం 1947-48):
1947 అక్టోబర్ 27 న రాష్ట్రాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడడానికి గుర్గావ్ లో లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్ ఆజ్జాపనతో ఢిల్లీ లోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుండి 5.00 గంటలకు 1 సిఖ్ఖు బెటాలియన్ భారత సైన్యం నాలుగు డకోటా విమానాల్లో బయలుదేరి 8.30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ మిషన్ కి ఆపరేషన్ జాక్ అనే పేరు పెట్టారు.అలా యుద్ధానికి మొదటి అడుగు పడింది.
భారత రెస్క్యూ మిషన్ మొదటి నుండి తీవ్ర ఇబ్బందులతోనే ముందుకు సాగింది. శ్రీనగర్ భారత్ సరిహద్దు కి 480 కి.మీ. దూరం లో పంజాబ్ దళాలు శరణార్ధలను కాపాడడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉండటం వల్ల వాయు రవాణా ఒక్కటే మార్గం ఉంది.కానీ అధ్వాన్నమైన విషయం ఏంటంటే? అక్కడ విమానాల ల్యాండింగ్ కి అస్సలు అనుకూలంగా లేదు.అయినా తప్పని సరి పరిస్థితుల్లో దాన్నే ఎంచుకోవాల్సి వచ్చింది.
శ్రీనగర్ కి చేరుకున్న వెంటనే శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు.మొదటి కంపెనీని బారాముల్లా పొలిమేరలకు తరలించారు.నాలుగువేల మంది బలవంతులైన రైడర్స్ దాడులు చేస్తున్నారక్కడ.వారి పైన పోరాడుతున్న డోగ్రా దళాలకు ఈ కంపెనీ సహాయం గా నిలిచింది. దళాలు ముందుకు సాగుతూ శ్రీనగర్ ని రక్షించాయి.1947 నవంబర్ 13న ఉరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో శ్రీనగర్ కి ముప్పు తప్పింది.పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా రైడర్లు దోపిడీలు, మానభంగాలు వదిలేసి పారిపోయారు.
దీనిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ గారికి మహావీర చక్ర అవార్డు ఇవ్వబడింది.
ఈ క్రమంలో అక్కడ జరిగిన యుద్ధాలు:
బద్గాం,ఝాంగర్ ని స్వాధీనం చేసుకోవడం,నౌషారా యుద్ధం తితావల్ కి చేరుకోవడం, పూంచ్ లో ఉపశమనం మరియు చంబ్ నుండి తిత్వాల్ కి చేరుకున్న యుద్ధం.
బద్గాం యుద్ధం:
నవంబర్ 3న 4 కుమవోలు,3 కంపెనీలు బద్గాం వద్ద పెట్రోలింగ్ విధుల్లో పాల్గొన్నారు.
ఒక గిరిజన లష్కర్ 700 మంది చొరబాటు దారులు గుల్మార్గ్ నుండి బద్గామ్ చేరుకున్నారు.స్థానికుల ఇళ్ళ నుండి సుమారు 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కంపెనీ పై కాల్పులు జరిపారు.సైన్యం 7:1 నిష్పత్తి లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మేజర్ సోమనాథ్ శర్మ.డి సైనికులను ధైర్యం గా పోరాడమని కోరారు.1 కుమవోన్, రిలీఫ్ కంపెనీ తోడయ్యారు.బద్గాంని స్వాధీనం చేసుకున్నారు.కానీ దాదాపుగా 200 మంది రైడర్ల చేతిలో చనిపోయారు.
ఝంగర్ పతనం ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడం:
1947 డిసెంబర్ 24న ఝంగర్ ని శత్రువులు ఆక్రమించారు.ఈ ప్రాతం శత్రువులకు చాలా
ప్రయోజనకరంగా మారింది.అందుకే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్ కి చాలా అత్యవసరమైనదిగా మారింది.
ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించి, రెండు దశల్లో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేసారు.
మొదట దశలో ఒక రాజ్ పుత్,ఒక డోగ్రా,ఒక కుమవోన్ తో కూడిన 19వ స్వతంత్ర బ్రిగేడ్ మరియు అనుబంధ యూనిట్లు,pt.3327 మరియు 3283.
రెండవ దశలో 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠా Li,3(పారా) రాజ్ పుత్,1 పటియాల మరియు అనుబంధ యూనిట్లు,Pt.2701,ఝంగర్,Pt.3399 మరియు Pt.3374, 7ఆశ్విక దళాన్ని కూడా నియమించారు.
ఆపరేషన్ సమయంలో కీలకమైన, వ్యూహాత్మక పాయింట్లలో ఒకటైన పీర్ థిల్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.
మార్చి 15న మరాఠ Li పీర్ థిల్ లో ప్రమాదకర నిఘా కోసం పంపబడింది.మార్చి 17కి పీర్ థిల్ ని విజయవంతంగా కైవసం చేసుకున్నారు.దాంతో ఝంగర్ పైన చివరి దాడికి మార్గం సుగమమైంది.
మార్చి 18న దాడి మొదలయ్యింది.అదే రోజున 3(పారా) రాజ్ పుత్ సైన్యం,Pt.3477 ఝంగర్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠ Li, 3(పారా) రాజ్ పుత్,1 పాటియాలా ఈ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంటాయి.
నౌషేరా లో విజయం:
ఫిబ్రవరి 6,1948 న నౌషేరాలో యుద్ధం చేయడానికి వ్యూహం సిద్ధమైంది.బెరి పట్టాన్ చుట్టు పక్కల నుండి శత్రువులను తరిమివేయడానికి ఆపరేషన్ సత్యనాస్ ప్రారంభించి జాట్ 2 యొక్క కో లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.జి.నాయుడిని నియమించారు. జనవరి 23న దళాలు తుంగ్ ని ఆక్రమించాయి మరియు జనవరి 25న ఉదయం సియోట్ మరియు పండిట్ పైన దాడి చేయడానికి వెళ్ళారు.Pt.2502 వారు అక్కడికి వచ్చారు మరియు శత్రువులతో భీకరంగా పోరాడారు. చివరికి శత్రువులు అక్కడ నుండి పారిపోయారు.100 మంది శత్రువులు మరణించి ఉంటారని లేదా గాయపడి ఉంటారని అంచనా.
తిత్వాల్ యుద్ధం:
మొత్తం కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ లలో ఈ తిత్వాల్ చాలా భయంకరమైనది మరియు సుదీర్ఘమైనది.పష్టూన్ గిరిజన మిలీషియా 1947-48 ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుని దాటి ఆక్రమించింది.ఈ తిత్వాల్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన గ్రామం. 1948 అక్టోబర్ 13న పాకిస్థాన్ సైన్యం భారీ దాడిని ప్రారంభించింది,భారత సైన్యం ఉన్న పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆ దాడులు జరిగాయి.కానీ భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం వలన భారీ ప్రాణ నష్టం తో ఘౌరంగా విఫలమయ్యారు.భారత సైన్యం యొక్క ఆత్మ స్థైర్యం మరియు సంకల్పం వలన తిత్వాల్ ను మనం కాపాడుకోగలిగాం.
1 సిక్కు,1 మద్రాస్,6 రాజ్ పుత్ రైఫిల్స్ బెటాలియన్స్ పాల్గొన్నారు.1948 జూలై 18న సీహెచ్ఎం పీర్ 6 రాజతానా రైఫిల్స్ కి చెందిన సింగ్ శత్రువులు ఆక్రమించిన దాడి చేసి కాపాడే పనిలో ఉన్నారు.అత్యంత శౌర్యాన్ని ప్రదర్శించినందుకు, ధైర్య సాహసాలనతో పరాక్రమవంతంగా పోరాడినందుకు అతనికి పరమ వీర చక్ర లభించింది.
ఉత్తర రంగం:
లడఖ్ ప్రావిన్స్ లోని ఈ పశ్చిమ భాగం ఇరవయ్యవ శతాబ్దపు ముందు రోజుల్లో డోగ్రా రాజుల పాలనలో ఉండేది.తర్వాత మహారాజ హరిసింగ్ బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చారు.బ్రిటిష్ ఇండియా మరియు రష్యన్ సామ్రాజ్యం మధ్య ఎత్తైన రక్షణాత్మక ప్రాంతంగా ఉండేది.గిల్గిట్ మరియు బాల్టిస్థాన్ నుండి ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాలలోని నంగా పర్వతాల మీదుగా 4000 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జిల్ పాస్ గుండా వేరు చేయబడింది.ఈ ప్రాంతంలో చాలా గొప్ప యుద్ధం జరిగింది.
కాశ్మీర్ యొక్క ఉత్తర ఫ్రంట్ లో గురైస్,స్కర్డ్,ద్రాస్, కార్గిల్ మరియు ద్రాస్ సెక్టార్ లు ఉన్నాయి.నవంబర్ 1947 నుండి ఆగస్టు 1948 వరకు ఈ ప్రాంతంలో శత్రువులు గొప్ప విజయం సాధించారు.దక్షిణం వైపు తొలి విజయం తో ఉబలాటంతో తీవ్రవాదులు అండగా నిలిచారు. తిరుగుబాటు చేయడంలో గిరిజనులు ప్రముఖ పాత్ర వహించారు.గిల్గిట్ 1947 అక్టోబర్ 31న గిల్టిట్ స్కౌట్స్ యొక్క పెద్ద విభాగం తో బలోపేతం చేయబడింది.దీనిలో ఒక రెజిమెంట్ స్థానిక షియా ముస్లిం మెజారిటీ జమ్మూ కాశ్మీర్ దళాలలో ఒక భాగం.ఈ దళానికి బ్రిటిష్ అధికారి మేజర్ బ్రౌన్ నాయకత్వం వహించారు.బ్రిటిష్ సైన్యం చేసిన అనేక సైనిక చర్యల్లో ఇది ఒకటి.తదుపరి దశల్లో రైడర్లు చేసిన తిరుగుబాటు దాడులకు పాకిస్థాన్ సైన్యం సహాయం చేసింది.అయితే వారికి వ్యతిరేకంగా భారత సైన్యం తన అసమాన శౌర్యం,పరాక్రమం చెప్పుకోదగ్గది.
స్కార్డ్ ముట్టడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 11 ఫిబ్రవరి 1948 న స్టార్డ్ పైన శత్రువులు దాడి చేశారు.ఆ రోజు నుండి ఆగస్టు 13 వరకు ఆరు నెలలు పాటు స్టార్డ్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.శత్రువులు ఫిబ్రవరి 1948 లో 16000 ఎత్తులో ఉన్న జోజిలా పాస్ ని దాటడానికి ప్రయత్నించారు.కానీ ఆ సమయంలో భారత సైన్యం అసమానమైన శౌర్యాన్ని కనబరచి అడ్డుకున్నారు.
నవంబర్ 1947న లెఫ్టినెంట్ కల్నల్ షేర్ జంగ్ థాపా 6 జమ్మూ కాశ్మీర్ పదాతిదళానికి చెందిన అతని సైన్యం బయలుదేరి డిశంబర్ 3న ఒక కోటకి చేరుకుని స్థిరపడ్డారు.శత్రువులు ఆధునిక రైఫిల్స్ ని కలిగి వాటిని ఉపయోగించడంలో నిపుణుల నాయకత్వం లో ఉన్నారు.మొత్తం 285 సైన్యం తో కెప్టెన్ థాపా 600 మంది శత్రువుల పైన పోరాడి గెలిచారు.
శత్రువులు లేహ్ పైన దాడి చేయడానికి లేహ్ మరియు కార్గిల్ ని దాటారు.వ్యవస్థీకృత రక్షణ ఉన్నప్పటికీ మే మూడో వారం నాటికి పరిస్థితి చాలా ప్రమాదకరం గా తయారైంది. కానీ అప్పుడు సైనికులకు శత్రువుల పైన దాడి చేయడానికి మిగిలిన ఏకైక మార్గం వాయు మార్గం.
భారత దేశం లో సైనిక విమానయాన రెడ్ లెటర్ సమయానికి ఎయిర్ కమాండర్ మెహర్ సింగ్ కూడా ఉన్నారు.24 మే 1948న మేజర్ తిమ్మయ్యతో కలిసి లేహ్ లో దిగారు. తర్వాత రెండు వారాల్లో మరిన్ని విమానాల్లో సైన్యం లేహ్ కి చేరుకుంటాయి.2/4 గూర్ఖా రైఫిల్స్ ని కూడా చేర్చారు.మెహర్ సింగ్ ధృడ నాయకత్వం లో పైలట్లు చేసిన సాహసోపేతమైన విన్యాసాలకు మహావీర చక్ర అందించబడింది.తర్వాత 2/8 గూర్ఖా రైఫిల్స్ ను చేర్చారు.
1948 వేసవిలో రైడర్లు కార్గిల్ మరియు ద్రాస్ చుట్టుపక్కల పట్టుని బిగించారు.పాకిస్థాన్ ఫ్రాంటియర్ రైఫిల్స్ గన్స్కర్ ఆశ్రమానికి చెందిన లామాని చంపారు. కార్గిల్ లో బౌద్ధ సన్యాసులను సామూహికంగా హత్యలు చేసారు.లడఖ్ లో రెండవ అతి పెద్ద మఠమైన్ రంగ్ డమ్ డొంపాని అపవిత్రం చేసి, ధ్వంసం చేశారు.
జోజిలా పాస్ ని స్వాధీనం చేసుకోవడానికి 77వ పారా బ్రిగేడ్ పదాతి దళాలు పదే పదే చేసిన దాడులు విఫలమయ్యాయి.
1948 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జనరల్ తిమ్మయ్య ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ని ప్లాన్ చేసారు.
అక్టోబర్ 1948 మధ్యలో జమ్మూ నుండి 7వ లైట్ కావల్రీకి చెందిన స్టువర్ట్ లైట్ ట్యాంకులు శ్రీనగర్ కి రహస్యంగా కదిలాయి. శ్రీనగర్ నుండి ఈ ట్యాంకులు 80 కి.మీ. దూరంలో కల బాల్తాల్ వైపుకి రవాణా చేయబడ్డాయి.వీరికి మేజర్ తంగరాజు ఆధ్వర్యంలోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపు ఇంజనీర్లు మాత్రమే కాదు రెండు కంపెనీలు అద్భుతంగా సహకరించాయి.జమ్మూ నుండి శ్రీనగర్ వరకు చెక్క వంతెనల మీద మార్గం సుగమమైంది.కానీ బాల్టాల్ నుండి జోజిలా పాస్ వరకు ట్యాంక్ రవాణాకి ఉపయోగపడే ట్రాక్ లను రోడ్డు చివరన కొన్ని గజాల వరకూ వేసారు.ట్రాక్ వేస్తున్నప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రాజేందర్ సింగ్ స్పారో ఆధ్వర్యంలో రెజిమెంట్ కొన్ని రోజుల పాటు గడ్డ కట్టే చలిలో శత్రువుల కాల్పులను తిప్పికొట్టారు.
1 నవంబర్ 1948న జొజిలా పాస్ నుండి శత్రువులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ వారిని తరిమి కొట్టారు.తర్వాత రెండు వారాల్లో ట్యాంకులు మరియు యుద్ధ విమానాల ద్వారా సంయుక్తంగా దాడులు చేశారు.హోరాహోరీ పోరు తర్వాత భారత సైన్యం లేహ్ మరియు ద్రాస్ లను స్వాధీనం చేసుకున్నారు.కార్గిల్ దండుకి చెందిన కాశ్మీర్ పదాతి దళాలు మరియు లేహ్ దండుతో కలిసి పాకిస్థాన్ సైనికులు మరియు రైడర్స్ పదే పదే చేసే దాడులను ఆపడానికి పట్టణం ముందు రక్షణగా నిలబడ్డారు.
పాకిస్థాన్ తో భారత సైన్యం ఇలా వీరోచితంగా పోరాడుతూ కాశ్మీర్ ని కాపాడుతున్న సమయంలో నెహ్రూ 13 ఆగస్టు 1948న యునైటెడ్ నేషన్స్ కి చేసిన ఫిర్యాదుతో 5 జనవరి 1949న సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చింది.దీని వలన రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు.దాంతో కాశ్మీర్ లో దాదాపు 30 శాతం భూభాగం పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది.కానీ కాశ్మీర్ రక్షణ కోసం భారత బలగాలను అనుమతిస్తారు.
మొత్తానికి 15 నెలల పాటు తీవ్రంగా కష్టపడి, కఠినమైన మార్గంలో కష్టపడి భయంకరమైన యుద్ధాలు చేసి శ్రీనగర్, బారాముల్లా,నౌషేరా,ఝంగర్,రాజౌరి,మెంథార్,పూంఛ్,స్క్వార్డ్,లేహ్, జోజిలా పాస్ ఇలా శత్రువుల చేతిలో చిక్కిన ఎన్నో ప్రాంతాలను ఆలస్యం గా అయినా సమర్ధవంతంగా స్వాధీనం చేసుకోగలిగారు.సరైన ఎయిర్ బేస్ లు, కమ్యూనికేషన్ లేకపోయినా వాటి సమర్ధవంతమైన సిబ్బంది,సైనికులు పటిష్టమైన నాయకత్వం లో కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.వారి శారీరక మరియు మానసిక ధైర్యం, వృత్తి నైపుణ్యం, అంకిత భావం, సంకల్పం, నిబద్ధత ప్రతికూ మరియు కఠినతరమైన వాతావరణంలో శత్రువులను తిప్పి కొట్టడంలో విజయం సాధించేలా చేసాయి.
మన సైన్యం ధైర్య సాహసాలు మన దేశానికి గర్వకారణంగా నిలిచాయి.
మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే,నాయక్ జాదునాథ్ సింగ్,L/Nk కరమ్ సింగ్ మరియు CHM పిరు సింగ్ వారి అసమానమైన ధైర్య సాహసాలకు పరమ వీర చక్ర ని పొందారు.
ఇంత వీరోచితంగా పోరాడిన మన సైన్యం గురించి,ఈ యుద్ధం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
భారత సైన్యం లోని వీర జాగిలాలు (కుక్కలు)
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్
మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
0 $type={blogger}